Road Accident: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై శుక్రవారంతెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అంబర్‌పేట మరియు బొంగులూరు మధ్య, పిల్లర్ నంబర్ 108 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున 3:26 గంటల ప్రాంతంలో జరిగినట్లుగా సమాచారం. ఎరుపు రంగు హ్యాచ్‌బ్యాక్ (TS 07 HW 5858) కారు పెద్ద అంబర్‌పేట నుండి బొంగులూరు వైపు వెళ్తుండగా, ముందు వెళ్తున్న ఒక లారీని వెనుక నుండి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, నాలుగో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిని మొయినాబాద్‌లోని గ్రీన్ వ్యాలీ రిసార్ట్‌లో పనిచేసే సిబ్బందిగా పోలీసులు గుర్తించారు.
Also Read: Trump: ట్రంప్‌కు దీర్ఘకాలిక సిరల వ్యాధి: వైట్‌హౌస్ ప్రకటన
వారిలో మలోత్ చందు లాల్ (29, మాసంపల్లి తండా, పాకాల కొత్తగూడ, వరంగల్ జిల్లా), గగులోత్ జనార్దన్ (50, దస్రుతండా, వరంగల్ జిల్లా), మరియు కావలి బాలరాజు (40, ఎన్కపల్లి, మొయినాబాద్) ఉన్నారు. మృతి చెందిన మరో వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తీవ్రంగా గాయపడ్డ ఐదో వ్యక్తిని బీఎన్ రెడ్డి నగర్‌లోని నిలాద్రి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ కట్టర్‌లతో కారు భాగాలను కట్ చేసి మృతదేహాలను బయటికి తీసి, ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించారు. సివిల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును నమోదు చేసింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ సంఘటనా స్థలం నుండి పారిపోగా, పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.