Horoscope
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రోజు మీకు సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి. మీరు ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు, మీ ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. మానసికంగా ధృడంగా ఉంటారు. ఉద్యోగంలో మీకు ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపారాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. ఖర్చులు పెరిగినా, అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. ఆలయాలను సందర్శించడం మంచిది. ఆరోగ్యంగా ఉంటారు. ఇష్టదేవతా స్తోత్రం చదవడం మీకు మేలు చేస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పేరుప్రతిష్టలు మరింత పెరుగుతాయి. బంధువులు, స్నేహితులతో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మీ హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల శుభం కలుగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): మీరు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది. అనేక మార్గాల నుండి ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగంలో వేతన పెరుగుదల గురించి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు కూడా మెరుగుపడతాయి. శ్రీలక్ష్మీదేవిని ఆరాధించడం చాలా మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు. కొత్త పనులు లాభాలను ఇస్తాయి. కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు. ఒక మంచి వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీరు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. శ్రీలక్ష్మీ దేవి ఆలయ దర్శనం మీకు మేలు చేస్తుంది.
Also Read: Sawan 2025: సావన్ సోమవారం రోజు ఉపవాసం ఉంటే.. అమ్మాయిలు తమకు కావాల్సిన వరుడిని పొందుతారా?
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత కోల్పోకుండా జాగ్రత్తపడాలి. కొన్ని సంఘటనలు కొద్దిగా అసౌకర్యాన్ని కలిగించవచ్చు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో అధికారం పెరుగుతుంది. వ్యాపారాలు కూడా వృద్ధి చెందుతాయి. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. శ్రీమహావిష్ణువును ఆరాధించడం ఉత్తమం.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఇది మీకు మిశ్రమ కాలం. ఉత్సాహంతో పనులు చేయాలి. సంకల్పంతో ముందుకు సాగి విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురుకావచ్చు. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఊహించని ధన లాభం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ముఖ్యమైన విషయాల్లో మీరు అనుకున్న ఫలితాలు పొందుతారు. మీ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. పదోన్నతి, జీతాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రీసుబ్రహ్మణ్య భుజంగస్తవం చదవడం శ్రేయస్కరం.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): పట్టుదలగా కృషి చేసి మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. కొన్ని అనవసరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కొన్ని పరిస్థితులు మానసిక ఆందోళనను కలిగిస్తాయి. ఉద్యోగంలో అధికారం పెరుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల శాంతితో పాటు శుభ ఫలితాలు లభిస్తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన మీకు బాధ కలిగించవచ్చు. ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బందికరంగా మారవచ్చు. కోపాన్ని తగ్గించుకోవడం చాలా అవసరం. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఆదాయం, ఆరోగ్యం బాగా ఉంటాయి. వ్యాపారాలు పురోగమిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గో సేవ చేయడం వల్ల మీకు శ్రేయస్సు కలుగుతుంది.
మకరం (ఉత్తరాషాడ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2): మీ శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరమైనప్పుడు సరైన సహాయం లభిస్తుంది. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుండి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీఆంజనేయ స్తోత్రం చదవడం శుభప్రదం.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): మీరు ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. శత్రువులపై నైతికంగా విజయం సాధిస్తారు. ఒక శుభవార్త మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వ్యాపారాలు చురుకుగా ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. శని ధ్యానం మీకు ఉత్తమ ఫలితాలను అందిస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): పెద్దల సూచనలు పాటించి ముందుకు సాగడం మంచిది. ఆర్థికంగా లాభాలు పొందుతారు. సమయానుకూలంగా వ్యవహరిస్తే విజయవంతులు అవుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. హనుమాన్ ఆరాధన శ్రేయస్కరం.