Horoscope Today

Horoscope Today: నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..మీ రాశి ఉందో లేదో చూడండి.

Horoscope Today: శుక్రవారం, జనవరి 30, 2026 నాటి ద్వాదశ రాశిఫలాలు మీకోసం. ఈ రోజు ఏ రాశి వారికి అదృష్టం ఎలా ఉంది, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

మేషం (Aries): వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృషభం (Taurus): వృత్తి, వ్యాపారాలు చాలా బిజీగా సాగుతాయి. అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. రావలసిన బాకీలు వసూలవుతాయి. ప్రయాణాల్లో ధన నష్టం జరిగే సూచనలున్నాయి కాబట్టి జాగ్రత్త అవసరం.

మిథునం (Gemini): ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయం అంచనాలకు మించి పెరుగుతుంది. దూర ప్రయాణాలు విజయవంతం అవుతాయి. సోదరులతో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కర్కాటకం (Cancer): ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం కొంత మందకొడిగా సాగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబ పెద్దల నుంచి ఆస్తి కలిసి వస్తుంది.

సింహం (Leo): రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

కన్య (Virgo): ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. అధికారుల అండదండలు లభిస్తాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. ఇతరులను గుడ్డిగా నమ్మకండి. పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి.

తుల (Libra): ఉద్యోగంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. స్నేహితుల వల్ల ఆర్థికంగా లాభపడతారు. ఒత్తిడి ఉన్నప్పటికీ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం (Scorpio): పని భారం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం పెరిగినా, ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండవచ్చు. వ్యయ ప్రయాసలు తప్పవు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ధనుస్సు (Sagittarius): కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూల సమయం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. మిత్రులతో సరదాగా గడుపుతారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

మకరం (Capricorn): ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

కుంభం (Aquarius): ఉద్యోగంలో ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఏలిన్నాటి శని ప్రభావం ఉన్నా, సమస్యలను తేలికగా అధిగమిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.

మీనం (Pisces): గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం శ్రేయస్కరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *