Horoscope: నేటి గ్రహాలను అనుసరించి ద్వాదశ రాశుల వారి జాతక విశేషాలను పరిశీలిస్తే, కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుండగా, మరికొందరు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు ఏ రాశి వారి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
మేషం
ఆదాయం నిలకడగా ఉంటుంది. మొండి బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంది. అయితే, సొంత నిర్ణయాల విషయంలో తొందరపాటు వద్దు. ఏకాగ్రతతో పని చేస్తే విజయం మీదే. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నవగ్రహ ధ్యానం శుభకరం.
వృషభం
మీ మాటకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రణాళిక లేకుండా చేసే పనులు ఇబ్బంది కలిగిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, ఇష్టదైవాన్ని స్మరించుకోండి.
మిథునం
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మిత్రుల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. సూర్య నమస్కారాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
కర్కాటకం
వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పట్టుదలతో కార్యాలను సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనోబలం పెరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి.
సింహం
అదృష్టం కలిసివచ్చే సమయం ఇది. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. షేర్లు, పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. సంతానం విషయంలో కొంత ఆందోళన కలగవచ్చు. లక్ష్మీదేవి ఆరాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
కన్య
ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుంది. ఆత్మీయుల సహకారంతో లక్ష్యాలను చేరుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఇంటి వాతావరణం సందడిగా ఉంటుంది. దక్షిణామూర్తిని ధ్యానించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది.
తుల
ఆదాయం భారీగా వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమై ఊరట లభిస్తుంది. అధికార పరిధి పెరిగే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తత అవసరం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు రక్షణగా నిలుస్తుంది.
వృశ్చికం
మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. బంధువులతో మాట్లాడేటప్పుడు ఓర్పు వహించండి. అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి సానుకూలంగా ఉంటుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించడం మేలు.
ధనుస్సు
ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల మరిన్ని శుభాలు కలుగుతాయి.
మకరం
కొత్త ఆదాయ మార్గాలు వెతుకుతారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. శాంతంగా వ్యవహరిస్తే పనులు సులభంగా పూర్తవుతాయి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మంచిది.
కుంభం
అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సుదూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశం రావచ్చు. అయితే, ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. పెద్దల సలహాలు స్వీకరించడం వల్ల ఇబ్బందులు తొలగుతాయి.
మీనం
ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తొలగి సంతోషంగా గడుపుతారు. శుభవార్తలు మీ ధైర్యాన్ని పెంచుతాయి. మొహమాటానికి పోయి ఖర్చులు పెంచుకోవద్దు. ఆంజనేయ స్వామి ఆరాధన మీకు శుభప్రదం.

