Horoscope

Horoscope: నేటి రాశిఫలాలు: ఏ రాశికి ఎలాంటి ఫలితాలు?

Horoscope

మేషం: మీ నిబద్ధత, అంకితభావం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. ఈ రోజు మీరు సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ లక్ష్యాలను సాధించడానికి శ్రీరాముని నామస్మరణ చేయండి.

వృషభం: ఈరోజు మీకు శుభవార్తలు వినబడతాయి. మీ ఆత్మీయుల నుండి ప్రేమ, ఆప్యాయత పొందుతారు. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉండండి. దుర్గాదేవిని పూజించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

మిథునం: మీరు మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలు రాకుండా జాగ్రత్త పడండి. ముఖ్యమైన విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. శివ స్తోత్రం పఠించడం శుభదాయకం.

కర్కాటకం: మీరు చిత్తశుద్ధితో పనులను పూర్తి చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోవద్దు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ మాట మీద నిలబడండి. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

సింహం: మీ తెలివితేటలు మీకు లాభాన్ని తెస్తాయి. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ చేయడం మంచిది.

కన్య: మీకు ధర్మసిద్ధి ఉంది. కీలకమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. మీ తెలివితేటలతో పనులను పూర్తి చేస్తారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ శుభకరం.

తుల: మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. విందు, వినోదాల్లో పాల్గొని సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. గణపతి ఆరాధన చేయడం మంచిది.

వృశ్చికం: మీరు మీ పనుల్లో శ్రద్ధగా పనిచేయాలి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయం సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. మీకు ఇష్టమైన దేవుడి నామాన్ని స్మరించడం మంచిది.

ధనుస్సు: సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు రావచ్చు. గోసేవ చేయడం మంచిది. విష్ణు సహస్రనామ పారాయణ మంచి ఫలితాలను ఇస్తుంది.

మకరం: ముఖ్యమైన పనుల్లో మీరు అనుకున్నది సాధిస్తారు. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అవసరమైన సహాయం అందుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. దుర్గా స్తోత్రం పఠించడం మంచిది.

కుంభం: మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తిలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీరామ నామ జపం చేయడం వల్ల మంచి జరుగుతుంది.

మీనం: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడండి. అనవసర గొడవలకు సమయాన్ని వృథా చేయకండి. దుర్గాదేవిని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

ALSO READ  Horoscope Today: వారి ఆదాయానికి లోటుండక పోవచ్చు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *