Horoscope Today

Horoscope Today: ప్రయాణం సమయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: జనవరి 22, 2026, గురువారం నాటి ద్వాదశ రాశిఫలాలు ఇక్కడ క్లుప్తంగా ఉన్నాయి. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూడండి:

మేషం: ఉద్యోగంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. అధికారులు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారంలో రాబడి బాగుంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం: పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ప్రయాణ సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది.

మిథునం: ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వాహన యోగం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుండి మంచి వార్తలు అందుతాయి. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.

కర్కాటకం: అధికారుల ప్రశంసలు దక్కుతాయి. అదనపు ఆదాయ మార్గాలు బాగుంటాయి. ముఖ్యమైన పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

సింహం: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు సాయం చేస్తారు.

ఇది కూడా చదవండి: Faria Abdullah: లవ్ లో చిట్టి.. ఎవరా మిస్టరీ బాయ్ ఫ్రెండ్?

కన్య: పని భారం పెరుగుతుంది. ఆర్థికంగా చిన్నపాటి సమస్యలు ఎదురవ్వచ్చు. ఎవరికీ వాగ్దానాలు చేయకండి. మొండి బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంది.

తుల: వృత్తి నిపుణులకు (డాక్టర్లు, లాయర్లు) ఆదాయం అంచనాలకు మించి ఉంటుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.

వృశ్చికం: పదోన్నతులకు అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి వివాదాలు సర్దుమణిగి పనులు విజయవంతంగా పూర్తవుతాయి.

ధనుస్సు: అధికారుల పూర్తి నమ్మకాన్ని పొందుతారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. మిత్రుల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

మకరం: రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

కుంభం: వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు ఉంటాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మీనం: తీరిక లేని సమయం గడుపుతారు. ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలున్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభకార్యాల చర్చలు జరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *