Horoscope: ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉండగా, మరికొన్ని రాశులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి – ఇలా అన్ని రంగాల్లో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషం:
మేషరాశి వారు మొదలుపెట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురైనా, వాటిని దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. మీ తెలివితేటలతో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం మీకు ఉంది, అలాగే దైవబలం కూడా మిమ్మల్ని రక్షిస్తోంది. ఇష్టదైవాన్ని దర్శించుకోవడం చాలా శుభప్రదం.
వృషభం:
మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మంచి లాభాలను తెస్తాయి. ఈరోజు శారీరక శ్రమ కాస్త ఎక్కువ అవుతుంది. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది. దుర్గా శ్లోకాన్ని చదవండి.
మిథునం:
మిథున రాశి వారు ఉత్సాహంగా పనులు చేయాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. పై అధికారులతో వ్యవహరించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఆచి తూచి మాట్లాడాలి. అయినప్పటికీ, మీ ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. రామ నామాన్ని స్మరించండి.
కర్కాటకం:
ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మీ బుద్ధిబలం ఉపయోగించి వ్యవహరిస్తే అడ్డంకులు తొలగిపోతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనో ధైర్యాన్ని కోల్పోవద్దు. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అనవసరంగా ఆందోళనపడే అవకాశం ఉంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
సింహం:
మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. చాలా రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గణపతి ఆరాధన శుభప్రదం.
కన్య:
మీరు చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. మీరు పడిన శ్రమకు తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది. ఒక మంచి వార్త మీకు ఆనందాన్నిస్తుంది. ఒత్తిడి పెరగకుండా ఉండేందుకు ముందుచూపుతో వ్యవహరించడం మంచిది. కనకధారాస్తవాన్ని పఠించాలి.
తుల:
ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. సమయ పాలన పాటిస్తూ పనులను పూర్తి చేస్తారు. పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దుర్గా ఆలయాన్ని సందర్శించడం శుభప్రదం.
వృశ్చికం:
మీరు చేపట్టే పనుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. మీరు పనిచేసే రంగాల్లో మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీకు ఇష్టమైన వారితో కాలాన్ని సంతోషంగా గడుపుతారు. ఆంజనేయుడిని ఆరాధిస్తే మంచిది.
ధనుస్సు:
మొదలుపెట్టిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. ఈరోజు సాహసోపేతమైన విజయాలు సాధించే అవకాశం ఉంది. శివ ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
మకరం:
మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా, వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఒత్తిడిని తట్టుకోలేక అధికారుల దగ్గర ఇబ్బందులు పడతారు. కుటుంబంలో చిన్నపాటి పొరపొచ్చాలు వచ్చే అవకాశం ఉంది. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
కుంభం:
వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దుర్గా స్తుతిని పఠిస్తే మంచిది.
మీనం:
వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాలలో అనుకూలమైన, ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి. కుటుంబ సభ్యుల పూర్తి సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు ఇతరుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.