Daily Horoscope: నేటి గ్రహాల స్థితి ప్రకారం ప్రతీ రాశిపై భిన్నమైన ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ఆరోగ్యం వంటి విషయాల్లో ఒక్కో రాశి వారికి ఒక్కో విధంగా ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు 12 రాశుల దినఫలాలను తెలుసుకుందాం.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో విజయం పొందే అవకాశముంది. అధికారుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో మంచి పురోగతితోపాటు ఆకస్మికంగా డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది.
వృషభ రాశి (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
పని పరంగా మంచి అవకాశాలు వస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు సఫలమవుతాయి. ఇంటి, బయటా బాధ్యతలు పెరగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ధన పరంగా ఇతరులకు హామీలు ఇవ్వకపోవడం మంచిది.
మిథున రాశి (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ఆర్థికంగా లాభాలున్నా, ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి. పిల్లల చదువులో శుభవార్తలు రావొచ్చు. ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం.
కర్కాటక రాశి (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
తలపెట్టిన పనులు పూర్తవుతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఉంటుంది. కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది. ఉద్యోగంలో పనిభారం ఉన్నా, ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.
సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1)
మీ తీరుకు ప్రశంసలు లభిస్తాయి. పని ఒత్తిడిలో నుంచి ఉపశమనం ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు వినడం మంచిది. కోపాన్ని నియంత్రిస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చు.
కన్య రాశి (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తిలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. కొన్ని అనుకున్న పనులు ఆలస్యం కావొచ్చు. ఆరోగ్య పరంగా శ్రద్ధ అవసరం. ముఖ్యమైన పరిచయాలు ఏర్పడతాయి.
తుల రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
పనిలో పైవారి ప్రశంసలు లభిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశముంది. కుటుంబ వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ధన యోగం మంచిది. నిరుద్యోగులకు అవకాశాలు కనిపిస్తాయి.
వృశ్చిక రాశి (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఈ రోజు మీకు మంచి రోజుగా చెప్పవచ్చు. చేపట్టిన పనులు సాఫీగా పూర్తవుతాయి. కుటుంబంలో ఆనందం ఉంటుందిప. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. పిల్లల విద్యపై దృష్టి పెట్టాలి.
Also Read: Pigeon Feather: ఇంట్లో పావురం ఈకను ఉంచుకుంటే ఏమి జరుగుతుందో తెలుసా?
ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అన్ని విషయాల్లో అదృష్టం తోడుంటుంది. జీతాలు, ఆదాయాలు పెరిగే సూచనలు ఉన్నాయి. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
కొందరికి పని ఒత్తిడితో పాటు ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. అపార్థాలు తలెత్తకుండా మాట్లాడటంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా నిలకడగా ఉన్నా, ఖర్చులు పెరుగుతాయి. అనుకున్న పనులు ఆలస్యం కావచ్చు.
కుంభ రాశి (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
పని భారం పెరగవచ్చు కానీ మీరు విజయవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయ పరిస్థితి మెరుగవుతుంది.
మీనం రాశి (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఇది శుభకాలం. దైవ దర్శనాలు, కుటుంబంతో గడిపే సమయం మీ మనసుకు శాంతినిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలున్నా, స్థిరంగా ఉంటారు. పెళ్లి సంబంధాల విషయంలో శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది.