Horoscope: ఈ శుక్రవారం, గ్రహాల స్థితులు కొన్ని రాశులకు అనుకూలంగా, మరికొన్నింటికి సవాళ్లతో కూడుకున్నవిగా ఉన్నాయి. గజలక్ష్మీ యోగం కారణంగా వృషభం సహా ఐదు రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి.
మేషం: ఈరోజు మీకు చాలా ముఖ్యమైన రోజు. చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. కొత్త పరిచయాల వల్ల మంచి ప్రయోజనాలుంటాయి. మీ బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.
వృషభం: ఈరోజు అనేక రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగులకు అనుభవాలు పనికొస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, పెట్టుబడులు వాయిదా వేయండి. బకాయిలు తిరిగి పొందుతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథునం: ఆరోగ్యపరంగా కొద్దిగా బలహీనంగా ఉంటారు, పాత ఆరోగ్య సమస్యలను విస్మరించవద్దు. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త. ఉద్యోగులు ఓపికగా పనిచేయాలి. వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.
కర్కాటకం: ఈరోజు కొన్ని ప్రత్యేక విజయాలు సాధిస్తారు. భాగస్వామ్యంతో పనులు మంచివి. ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి. ఆహారంపై శ్రద్ధ వహించండి. ఉద్యోగులు కొత్త ప్రణాళికలు ప్రారంభించవచ్చు.
సింహం: ఈరోజు చాలా కష్టపడి పనిచేయాలి. ఉద్యోగులు తమ కృషి, అంకితభావంతో ఉన్నతాధికారులను ఆశ్చర్యపరుస్తారు. ఎవరితోనూ వాదించవద్దు. కళాత్మక నైపుణ్యాలతో మంచి స్థానాన్ని పొందుతారు.
కన్య: ఈరోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. పెద్దల సలహాలు పాటించడం మంచిది. ఉద్యోగులు మంచి పనితీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. దిగుమతి-ఎగుమతి వ్యాపారులకు శుభవార్తలుంటాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు.
తుల: ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. పెండింగ్ పనులను పూర్తి చేయండి. కుటుంబ సభ్యులతో గొడవలకు దిగవద్దు. కొత్త భూమి, వాహనం, ఇల్లు కొనుగోలు కోరిక నెరవేరుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
వృశ్చికం: ఈరోజు ధైర్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇతరులకు సహాయం చేసేటప్పుడు జాగ్రత్త. వ్యాపారులు చిన్న లాభాలను కోల్పోకూడదు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
ధనుస్సు: ఉద్యోగంలో మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.
మకరం: ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సహాయం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంతో విహారయాత్రకు ప్లాన్ చేస్తారు.
కుంభం: ఈరోజు శుభ ఫలితాలున్నాయి. సౌభాగ్యసిద్ధి ఉంటుంది. ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలుంటాయి.
మీనం: ఆర్థిక వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో ముందుకు సాగితే శుభ ఫలితాలు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లక్ష్మీ ధ్యానం మానసిక శక్తిని పెంచుతుంది.

