Home Guard Suicide: ఆర్థిక ఇబ్బందులకు తోడు.. ఈ నెల వేతనం సమయానికి అందకపోవడంతో ఒక హోంగార్డు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకున్నది. హైదరాబాద్ నగరంలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీంతో హోంగార్డుల కుటుంబాల్లో ఆందోళన నెలకొన్నది. వచ్చే కొద్దిపాటి వేతనం కూడా నెలనెలా సక్రమంగా అందకపోవడంతో ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి.
Home Guard Suicide: గోవర్ధన్ అనే హోంగార్డుకు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కూతురు ఉన్నది. ఆమెకు తరచూ అనారోగ్యం అవుతుండటంతో నెలనెలా వైద్యం చేయిస్తున్నాడు. దీంతో ఆర్థికంగా ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాడు. అయితే జీతం నెలనెలా సమయానికి అందక, కూతురుకు వైద్యం చేయించలేక అవస్థలు పడుతున్నాడు.
Home Guard Suicide: ఆయా ఇబ్బందులతో గోవర్ధన్ మనస్తాపం చెందాడు. కూతురుకు సరైన వైద్యం చేయించలేని దౌర్భాగ్యంపై తోటి ఉద్యోగుల వద్ద కూడా తరచూ చెప్పేవాడని తెలిసింది. శుక్రవారం (మే 17) ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
