Prabhas:కేజీఎప్ 1, కేజీఎఫ్ 2, కాంతార, సలార్ 1 వంటి పాన్ ఇండియా సినిమాలు నిర్మించి దేశంలోనే ప్రముఖ సంస్థగా పేరొందిన హోంబలే ఫిల్మ్స్ చిత్ర నిర్మాణ సంస్థ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మూడు సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేసింది. ఇదే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సంస్థ సలార్ 1 సినిమాను 2023 డిసెంబర్ 22న విడుదల చేసి సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
Prabhas:సలార్ 1 సినిమాకు కొనసాగింపుగా హోంబలే చిత్ర నిర్మాణ సంస్థ సలార్ 2- శౌర్యాంగపర్వం సినిమాను రూపొందించనున్నది. ఇదే కాకుండా మరో రెండు సినిమాలను ప్రభాస్‌తోనే నిర్మించనున్నది. భారతీయ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా ఈ మూడు సినిమాలను రూపొదించనున్నట్టు నిర్మాత విజయ్ కిరగందూర్ వెల్లడించారు. ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతి కలిగేలా ఈ సినిమాల చిత్రీకరణ జరుగుతుందని తెలిపారు.
Prabhas:హోంబలే ఫిల్మ్స్ చిత్ర నిర్మాణ సంస్థ ప్రభాస్‌తో తీసే ఈ మూడు సినిమాలను సలార్ 2 శౌర్యాంగపర్వం 2026లో, ఆ తర్వాత సినిమాలు 2027, 2028లో ఏడాది ఒకటి చొప్పున నిర్మించనున్నట్టు తెలిపారు.