Michelle Trachtenberg: హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్‌బర్గ్ (39) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ అపార్ట్‌మెంట్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్నటు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ అధికారులు ఆమె వెంటనే హాస్పిటల్ కి తీసుకోని వెళ్లారు కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.
చిన్న వయసులోనే సినీ ప్రయాణం
మిచెల్ మూడేళ్ల వయసులోనే బాలనటిగా కెరీర్ ప్రారంభించారు. 1996లో వచ్చిన ‘హ్యారియెట్ ది స్పై’ చిత్రంతో గుర్తింపు పొందారు. ఆమెకు విశేషమైన పేరు తెచ్చిన టీవీ సీరీస్‌లలో ‘బఫీ ది వాంపైర్ స్లేయర్’ (2000-2003) మరియు ‘గాసిప్ గర్ల్’ (2008-2012) ముఖ్యమైనవి. ఆమె ‘యూరోట్రిప్’, ‘17 ఎగైన్’, ‘ది స్క్రిబ్లర్’ వంటి సినిమాల్లో కూడా నటించారు.
ఇది కూడా చదవండి: Shah Rukh Khan: ‘మన్నత్’ నుంచి వెళ్లిపోతున్న షారుక్ ఫ్యామిలీ.. ఎందుకంటే..?
మరణానికి కారణం?
పోలీసులు మిచెల్ మరణానికి గల కారణాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఇటీవల ఆమె కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసింది. ఈ ఆరోగ్య సమస్యలే ఆమె మరణానికి దారితీసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
సినీ రంగానికి తీరని లోటు
మిచెల్ ఆకస్మిక మృతి హాలీవుడ్‌లో తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది. ఆమె అభిమానులు, సహనటులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే వెలుగులోకి వచ్చిన మిచెల్, తన ప్రతిభతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఆమె అకాలమరణం సినీ పరిశ్రమకు తీరని లోటు.