HMPV Virus In India: బెంగళూరులో 8 నెలల పాపకు హెచ్‌ఎంపీవీ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వైరస్ భారతదేశంలో సర్వసాధారణం ఇది చైనాలో కనిపిస్తున్న మ్యూటేషన్ కు సంబంధించినదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ తెలిపింది. శిశువుకు జ్వరం రావడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రక్త పరీక్షలో HMPV వైరస్ ఉన్నట్లు తేలింది. అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్ష్ గుప్తా చెప్పారు.
HMPV వైరస్ భారతదేశంలో కూడా ఉంది. అయితే, ఇది చైనా మ్యుటేషన్ అవునా.. కాదా అనేది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. చైనాలో పరివర్తన చెందిన వైరస్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందువల్ల ఇక్కడ కనిపించినది సాధారణ HMPV వైరస్ లేదా చైనీస్ జాతికి చెందినదా? అనే గందరగోళం ఉంది. భారత్‌లోనూ సాధారణ హెచ్‌ఎంపీవీ వైరస్ 0.78 శాతంగా కనిపిస్తుందని చెప్పారు.
ప్రస్తుతం, సోకిన చిన్నారి కుటుంబ సభ్యులు ఎక్కడికి ప్రయాణించలేదు.. కానీ వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ కూడా ఈ విషయంపై ఆరా తీస్తోంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హర్షగుప్తా చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Prashant Kishor Arrest: బీహార్‌లో టెన్షన్.. ప్రశాంత్ కిషోర్ అరెస్ట్
HMPV వైరస్ అంటే..
చైనాలో ఆందోళనకు కారణమైన హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ లేదా HMPV కొత్తది కాదు. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం 2001లో ఇది మొదటిసారిగా కనిపించింది. అయితే, కొన్ని సెరోలాజిక్ ఆధారాల ద్వారా 1958 నుండి వైరస్ విస్తృతంగా వ్యాపించిందని నిపుణులు తెలిపారు.
ఇది కరోనా వైరస్‌కి భిన్నంగా ఉందా?
కరోనావైరస్ లేదా COVID-19 ఒక అంటు వ్యాధి. ఇది SARS-CoV-2 వైరస్ వల్ల వస్తుంది. HMPV వైరస్ – కరోనా వైరస్ కొన్ని విషయాల్లో సారూప్యత కలిగి ఉంటాయి. ఉదాహరణకు.. రెండు వైరస్‌లు అన్ని వయసులవారిలో శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి. చిన్నపిల్లలు, వృద్ధులు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులు ఎక్కువగా ప్రమాదంలో ఉన్నారు.
ప్రస్తుతం, HMPV వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి టీకా లేదు. ప్రస్తుతం భారతదేశంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.