Hit-3: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమా ‘హిట్ -3: ది థర్డ్ కేస్’. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని దీనిని నిర్మిస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నాని హిట్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన తాజా షెడ్యూల్ కశ్మీర్ లో మొదలైంది. ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు నాని, ఫైటర్స్ తో ఇంటెన్స్ యాక్సన్ సీన్స్ ను చిత్రీకరించబోతున్నారు.
ఇది కూడా చదవండి: Raja Saab: ‘రాజా సాబ్’ విడుదల వాయిదా పడబోతోందా
Hit-3: ఇప్పటికే మూవీ రిలీజ్ డేట్ ను దర్శక నిర్మాతలు ప్రకటించారు. మే 1న ఈ సినిమా రాబోతోంది. దాంతో దానికి తగ్గట్టుగా శరవేగంగా షూటింగ్, దానితో పాటే నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుతున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.