Hit-3 : నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్-3’ మే 1న గ్రాండ్ వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు సిద్ధమైంది. హిట్ ఫ్రాంచైజీలో మూడో భాగంగా దర్శకుడు శైలేష్ కొలను ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. ఓవర్సీస్ మార్కెట్‌లో, ముఖ్యంగా యూఎస్‌లో ఈ చిత్రం భారీ అంచనాల నడుమ రిలీజ్ కానుంది. యూఎస్ ప్రీమియర్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్స్ షురూ కాగా, రిలీజ్‌కు వారం ముందే ప్రీ-సేల్స్‌లో 100K డాలర్ల వసూళ్లతో ‘హిట్-3’ సంచలనం సృష్టిస్తోంది.
Also Read: Mahesh Babu: మహేష్ బాబుకు ఈడీ షాక్: కోట్ల లావాదేవీలపై నోటీసులు!
Hit-3: ప్రమోషన్స్ కోసం నాని స్వయంగా అమెరికా వెళ్లనుండటంతో ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు నాని మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. యూఎస్‌తో పాటు గ్లోబల్ మార్కెట్‌లో ‘హిట్-3’ ఎలాంటి రికార్డులు నెలకొల్పుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ చిత్రం నాని కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు.
హిట్ 3 తెలుగు ట్రైలర్ :