Amit Shah: భారత రాజకీయాల్లో మరో అరుదైన రికార్డు నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరువాత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ చరిత్రలో అత్యధిక కాలం హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. గతంలో బీజేపీ అగ్ర నాయకుడు ఎల్.కె. అద్వానీ పేరుతో ఉన్న రికార్డును అమిత్ షా ఇప్పుడు బద్దలు కొట్టారు. 2019లో మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమిత్ షా హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మూడోసారి కూడా ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. ఈ ఆగస్టు 5న, అమిత్ షా హోంమంత్రిగా 2,194 రోజులు పూర్తి చేసి కొత్త రికార్డు సృష్టించారు.
అంతకుముందు, ఎల్.కె. ఎల్‌కే అద్వానీ 1998 నుండి 2004 వరకు హోంమంత్రిగా 2,193 రోజులు పనిచేశారు. ఇప్పుడు ఆ రికార్డును అమిత్ షా అధిగమించారు. అద్వానీతో పాటు, కాంగ్రెస్‌కు చెందిన గోవింద్ వల్లభ్ పంత్ కూడా ఆరు సంవత్సరాలకు పైగా ఈ పదవిలో ఉన్నారు.
Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిందని అంటాడు..రూ.6000 కోట్లకు టెండర్లు..
అమిత్ షా హోంమంత్రిగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ప్రధానమైనవి ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌లను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం. అలాగే, దేశంలో నక్సలిజం నిర్మూలనకు సంబంధించి కూడా ఆయన కీలక చర్యలు తీసుకున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీని అనేక ఎన్నికల్లో విజయపథంలో నడిపించారు. ఇప్పుడు మోడీ కేబినెట్‌లో హోంమంత్రిగా తనదైన ముద్ర వేశారు.