Sudigali Sudheer: హైదరాబాద్‌లోని ఓ టీవీ షోలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఈ షోలో పాల్గొని, స్టేజిపై నందీశ్వరుడి విగ్రహాన్ని తీసుకొచ్చాడు. ఆ విగ్రహం తల భాగం నుంచి శివుడిని చూసినట్లు నటిస్తూ, సుధీర్.. నటి రంభ వైపు చూసి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వెనక ఉన్న యాంకర్ రవి, “ఏంటి బావ, స్వామివారి దర్శనం అయ్యిందా?” అని అడగ్గా, “నాకు అమ్మోరు దర్శనమైంది” అంటూ రంభను ఉద్దేశించి సుధీర్ సమాధానమిచ్చాడు.
ఈ వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ హిందూ దేవతలను అవమానించే విధంగా వ్యవహరించాడని, ఆయన చర్య మత విశ్వాసాలను కించపరిచేలా ఉందని కొందరు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఘటనపై విస్తృతంగా ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Sudigali Sudheer: మరోవైపు, సుధీర్ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. “ఇది కేవలం సినిమా స్పూఫ్‌లో భాగం మాత్రమే. దీన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు” అంటూ అతడిని సమర్థిస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం రెండు వర్గాల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. సుధీర్ ఈ ఘటనపై ఎలా స్పందిస్తాడో చూడాలి.