Uttar Pradesh

Uttar Pradesh: అనుమానాస్పద స్థితిలో 14 ఏళ్ళ యువకుడి మృతి

Uttar Pradesh: 14 ఏళ్ళ వయసులోనే ఓ బాలుడు డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లకు బానిసై అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. స్థానిక రాష్ట్రంలోని సాగర్ గంగ్వార్ అనే 14 ఏళ్ళ బాలుడు తన మేనమామ ఓం ప్రకాష్‌తో కలిసి బరేలీలోని ఆనంద్ విహార్ కాలనీలో ఉంటున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే సాగర్ తల్లి సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేస్తోంది. 

కాగా సప్నా సింగ్ “క్రైమ్ పెట్రోల్, మతి ​​కి బన్నో  తదితర టీవీ ప్రోగ్రామ్‌లలో నటించి బాగానే ఆకట్టుకుంది. ఈ క్రమంలో షూటింగ్ నిమిత్తమై ముంబైలో నివాసం ఉంటోంది. అయితే సాగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో సప్నా సింగ్ బరేలీ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా కి దిగింది. ఈ క్రమంలో తన కొడుకు చావుకి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని, అలాగే లోతుగా దర్యాప్తు చేపట్టాలని పోలీసులని డిమాండ్ చేసింది. 

ఇది కూడా చదవండి: Revanth Reddy: రైతుకు బేడీలు..సీఎం సీరియస్..

Uttar Pradesh: అయితే సాగర్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన పోలీసులు విస్తుపోయే విషయాల్ని కనుగొన్నారు. ఈ క్రమంలో పోస్ట్ మార్టం రిపోర్టులలో సాగర్ మద్యంతోపాటు, డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు కనుగొన్నారు. దీంతో సాగర్ స్నేహితులైన సూరజ్, సన్నీలని అదుపులోకి తీసుకుని విచారించగా సాగర్ కి డ్రగ్స్, మద్యం అలవాట్లు ఉన్నాయని పోలీసుల విచారణలో వెల్లడించారు. అంతేగాకుండా సాగర్ మృతికి ముందు పోలీసులు సిసి కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఈ క్రమంలో సాగర్ తన ఇద్దరి స్నేహితులతో కలసి వెళ్తున్నట్లు గమనించారు. 

దీంతో తమదైన స్టైల్ లో ఇద్దరినీ విచారించగా అసలు నిజం బయటపడింది. సాగర్ మృతి చెందడానికి ముందు ఈ ముగ్గురు కలసి ఫుల్లుగా మద్యం సేవించారని దీంతో సాగర్ కి డోస్ ఎక్కువవడంతో అక్కడిక్కడే మృతి చెందడంతో వారు భయపడి మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యామని పోలీసుల విచారణలో తేలింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Amaravati: ఆంధ్రప్రదేశ్‌ను సముద్ర వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక ఒప్పందం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *