High Court:రాష్ట్ర ప్రభుత్వ వసతి గృహాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజన మెనూ వివరాలపై రెండు వారాల్లోగా నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్‌కు ఆ ఆదేశాలను జారీ చేసింది. వాస్తవ పరిస్థితులను నివేదిక రూపంలో అందించాలని నిపుణుల కమిటీని తాము ఆదేశిస్తామని హైకోర్టు పేర్కొన్నది.
High Court:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వసతిగృహాలు, పాఠశాలల భవనాల నిర్వహణ, వసతులపై న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో వసతులపై నిపుణులతో కమిటీని నియమిస్తామని హైకోర్టు వెల్లడించింది.
High Court:రాష్ట్రంలో ఉన్న 9,000కు పైగా ఉన్న వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు సరైన వసతులు లేవని, ప్రభుత్వం వసతులు కల్పించడం లేదని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తన వాదనలో వినిపించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని, తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
