High Court:

High Court: రేవంత్ స‌ర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ‌

High Court: తెలంగాణలోని సీఎం రేవంత్‌రెడ్డి స‌ర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. ల‌గ‌చ‌ర్ల‌, హ‌కీంపేట గ్రామాల ప‌రిధిలో భూసేక‌ర‌ణ‌పై స్టే ఇచ్చింది. ఏకంగా ఆ నోటిఫికేష‌న్‌నే ర‌ద్దు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న ల‌గ‌చ‌ర్ల‌, హ‌కీంపేట గ్రామాల ప‌రిధిలో తొలుత ఫార్మా కంపెనీల కోసం భూసేక‌ర‌ణకు నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఈ మేర‌కు రైతుల‌తో స‌మావేశం ఏర్పాటు చేయ‌గా, రైతులంతా తిరుగుబాటు చేశారు. క‌లెక్ట‌ర్‌, ఇత‌ర అధికారుల‌పై దాడికి దిగారు. వారి వాహ‌నాల‌పై దాడి చేసి ధ్వంసం చేశారు.

High Court: ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డి స‌హా 50 మందికి పైగా రైతుల‌కు రిమాండ్ విధించి జైలులో ఉంచ‌గా, బాధిత కుటుంబాలు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌, ఇత‌ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌తో పాటు కేంద్రంలోని ఎస్టీ క‌మిష‌న్‌, ఇత‌ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ల‌ను క‌లిసి త‌మ‌కు జ‌రిగిన అన్యాయంపై ఏక‌రువు పెట్టారు. దీంతో దేశ‌వ్యాప్తంగా ఈ ఘ‌ట‌న‌పై వ్య‌తిరేకత వెల్లువెత్తింది. గిరిజ‌న సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకించాయి. ఈ ద‌శ‌లో ప్ర‌భుత్వం ఇచ్చిన నోటిఫికేష‌న్‌ను ర‌ద్దు చేసింది.

High Court: ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కే న‌వంబ‌ర్ 30న అదే ప్రాంతంలో మ‌ల్టీప‌ర్ప‌స్ పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు నోటిఫికేష‌న్‌ను రాష్ట్ర‌ ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఇందుకు సంబంధించిన భూసేక‌ర‌ణ‌ను మొద‌లుపెట్టింది. ఈ ద‌శ‌లో ప‌లువురు ఈ భూసేక‌ర‌ణ‌ను నిలిపివేయాల‌ని కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం భూసేక‌ర‌ణ నోటిఫికేష‌న్‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. దీంతో రేవంత్‌రెడ్డి స‌ర్కార్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందోన‌నే అంశం ఉత్కంఠ‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *