Hydra Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది.నగరంలో కూల్చివేతలపై ఆయనకు న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. తమ ముందు విచారణకు హాజరుకావాలని కోర్టు ఆయనను ఆదేశించింది. అమీన్పూర్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని ఇటీవల ఓ భవనాన్ని కూల్చేసిన హైడ్రా అధికారులు. బిల్డింగ్ కూల్చివేతను సవాల్ చేస్తూ బాధితులు కోర్లును ఆశ్రయించారు. ఈ కేసు కోర్టులో ఉందని చెప్పినా వినిపించుకోకుండా కూల్చేశారని హైకోర్టులో బాధితులు పిటిషన్ వేశారు.
Hydra Ranganath: శుక్రవారం ఈ కేసు విషయంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని కమిషనర్ రంగనాథ్‌ను ప్రశ్నించింది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఈ నెల 30వ తేదీ సోమవారం ఉదయం 10:30 రంగనాథ్ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వ్యక్తిగతంగా లేదా ఆన్‌లైన్‌లో అయినా విచారణకు హాజరు కావాలని కోర్టు నోటీసులో పేర్కొంది.
Hydra Ranganath: కాగా, రంగనాథ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా.. నగరంలో దూకుడు చూపెడుతున్నది. ఆక్రమణలను నిర్ధాక్షిణంగా కూల్చేస్తోంది. దీంతో హైడ్రా ఎప్పుడు అటాక్ చేస్తుందోనని అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.ఇప్పటికే వందల భవనాలను హైడ్రా అధికారులు కూలగొట్టిన సంగతి తెలిసిందే.