High Court: బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న రజతోత్సవ సభ నిర్వహణకు అనుమతిపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలను జారీచేసింది. ఇప్పటికే వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో సభ కోసం ఏర్పాట్లను ముమ్మరంగా చేపడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సభ కోసం ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ క్యాడర్ కూడా సమాయత్తం అవుతున్నది. ఈ దశలో ఇంకా సభ నిర్వహణపై అనుమతి రాకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
High Court: ఈ నేపథ్యంలో వరంగల్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం (ఏప్రిల్ 11) హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సభ నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. వారం రోజుల్లో సభకు అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఏప్రిల్ 17లోగా సభ అనుమతిపై నిర్ణయం చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
High Court: ఇదే సమయంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనుమతి విషయంలో వరంగల్ పోలీసులకు హైకోర్టు నోటీసులను జారీచేసింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 17 తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, ఒకవైపు బీఆర్ఎస్ సభ తేదీని ప్రకటించిన అనంతరం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్-30ని అములులోకి తేవడం గమనార్హం. నెలరోజులపాటు పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెలరోజులపాటు ఎలాంటి ర్యాలీలు, సభలు, ఊరేగింపులను నిషేధిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.
High Court: ఈ దశలో బీఆర్ఎస్ పార్టీకి 25 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురష్కరించుకొని రజతోత్సవ సభ నిర్వహణకు నిర్ణయించుకున్నది. ఏప్రిల్ 27న ఆ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఎల్కతుర్తిలో రజతోత్సవ మహాసభ, బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సభ నిర్వహిసత్ఆమని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. పోలీసుల అనుమతి నిరాకరణతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.