High Court:

High Court: ఆ ప‌థ‌కం అమ‌లులో స‌ర్కారుపై హైకోర్టు సీరియ‌స్‌

High Court: తెలంగాణ ప్ర‌భుత్వం ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కాన్ని లాంఛ‌నంగా ప్రారంభించిన 24 గంట‌ల్లోనే ఆ ప‌థ‌కం అమ‌లు విష‌యంపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది. ల‌బ్ధిదారుల ఎంపిక‌లో అస‌మ‌గ్ర‌త‌ను ప్రశ్నించింది. గ్రామాల్లో ఉపాధి కూలీ ప్రామాణిక‌తగా గుర్తించిన ప్ర‌భుత్వం ఏటా రూ.12 వేల చొప్పున ఇవ్వ‌నున్న‌ది. కానీ, న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ఉండే కూలీల‌ను విస్మ‌రించ‌డంపై మండిప‌డింది.

High Court: ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కాన్ని గ్రామాల్లోనే అమ‌లు చేస్తున్న ప్ర‌భుత్వం.. రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీల్లో 8 ల‌క్ష‌ల మందికిపైగా కూలీలు ఉన్నార‌ని పేర్కొంటూ సామాజిక కార్య‌క‌ర్త గ‌వినోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ పిటిష‌న్‌ను సోమ‌వారం విచారించిన హైకోర్టు ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది.

High Court: కూలీలు ఎక్క‌డున్నా కూలీలేన‌ని హైకోర్టు పేర్కొన్న‌ది. నాలుగు వారాల్లోగా మున్సిపాలిటీల‌లో ఉన్న కూలీల‌కు కూడా ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కం కింద న‌గ‌దు సాయం అంద‌జేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. మున్సిపాలిటీల్లో ఉన్న అర్హ‌త క‌లిగిన కూలీలంద‌రికీ ఈ ప‌థ‌కం వ‌ర్తింప‌జేయాల‌ని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్ర‌ట‌రీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *