High Court: బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ ధరల పెంపు అంశం ఇటీవల తీవ్ర చర్చకు దారితీసింది. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోకు వచ్చిన జనం తొక్కిసలాటతో ఓ మహిళ నిండు ప్రాణం బలైంది. ఆమె తనయుడైన బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఇంకా కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ దశలో హైకోర్టులో కేసులు నమోదయ్యాయి.
High Court: అర్ధరాత్రి సినిమా ప్రదర్శనలపై తాజాగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతిపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ జరిపారు. సినిమా థియేటర్లకు రాత్రి 11 తర్వాత 16 ఏండ్ల లోపు వయసున్న పిల్లలను అనుమతించొద్దని ఆదేశించింది. పిల్లలు వెళ్లే వేళలపై అన్నివర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
High Court: ఇప్పటికే ఆయా విషయాలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ వైఖరిని కూడా తప్పుబట్టింది. సినిమా టికెట్ల ధరలు పెంచబోమని, బెనిఫిట్ షోలకు అనుమతించబోమని నిండు అసెంబ్లీలో పాలకులు ప్రకటించిన కొద్దిరోజులకే అనుమతి ఇవ్వడంపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. మహిళ మృతి, బాలుడికి తీవ్రగాయాల పాలయ్యేందుకు కారణమైన తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించింది.