Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు అయి రిమాండ్‌లో ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. ఈ మేరకు ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. తొలుత వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు చంచలగూడ జైలుకు తరలిస్తుండగా, అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు కొనసాగాయి.
Allu Arjun: ఈ సమయంలో హైకోర్టు అనూహ్య నిర్ణయం తీసుకున్నది. చివరి నిమిషంలో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ తరఫు న్యాయవాది.. అర్ణబ్ గోస్వామి, మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో బాంబే కోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించడంతో వాటి ఆధారంగా కోర్టు ఈ బెయిల్‌ను మంజూరు చేసింది. జైలు సూపంరింటెండెంట్‌కు రూ.50 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును సంప్రదించాలని పేర్కొన్నది.
Allu Arjun: క్వాష్ పిటిషన్‌పై వాదనల సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అల్లు అర్జున్‌కు జీవించే హక్కు ఉన్నదని పేర్కొన్నది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు ఆయనకు వర్తించవని పేర్కొన్నది. రేవతి కుటుంబంపై సానుభూతి ఉన్నదని, అంతమాత్రాను నేరాన్ని అల్లు అర్జున్ ఒక్కరిపైనే రుద్దలేమని పేర్కొన్నది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని తెలిపింది.