Ap news: ఏపీ హైకోర్టు హోంగార్డులకు భారీ ఊరట కల్పించింది. కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని స్పష్టం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డును ఆరు వారాల్లో ప్రత్యేక మెరిట్ జాబితా సిద్ధం చేయాలని ఆదేశించింది.
హోంగార్డుల పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలను పరిశీలించిన హైకోర్టు, నియామకాల్లో పారదర్శకతను నొక్కి చెప్పింది. హోంగార్డుల తరపున న్యాయవాదులు శీనాకుమార్, శివరాం, ఆంజనేయులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున ఏజీ వాదిస్తూ, నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నిబంధనలు మార్చడం కుదరదని స్పష్టం చేశారు.
అంతిమంగా, హోంగార్డుల సేవలకు ప్రాధాన్యం ఇచ్చి, ఎంపిక ప్రక్రియలో వారికి ప్రత్యేక స్థానం కల్పించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ తీర్పు హోంగార్డులకి న్యాయం చేసే దిశగా కీలక మలుపు కావొచ్చు.
