HHVM Success Meet: పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయి హిట్ టాక్ తెచ్చుకుంది. పవన్ ఫాన్స్ నిన్న రాత్రి నుండి థియేటర్స్ దగ్గర ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. దింతో ఈ సినిమా విజయోత్సవ వేడుకగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో గ్రాండ్ సక్సెస్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో పాటు చిత్రబృందం మొత్తం హాజరయ్యే అవకాశం ఉంది. సినిమా విజయంపై టీమ్ ఆసక్తికర విషయాలు పంచుకునే అవకాశం ఉన్నందున అభిమానులు, మీడియా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.