Om Harudu

Om Harudu: హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘ఓం హరుడు’ సినిమా నుంచి ‘ఉప్పు కప్పు రంబు’ సాంగ్ లాంచ్

Om Harudu: వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘ఓం హరుడు’ నుంచి తాజాగా ఓ పాట విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా ప్రచార కంటెంట్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించగా, తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఉప్పు కప్పు రంబు’ అనే మాస్ మసాలా పాటను ప్రముఖ హీరో శ్రీకాంత్ గారు లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్‌లో ఉంది.

వెంకట్, రవీందర్, శ్రీహరి, హెబ్బా పటేల్, సలోని, నాటషా సింగ్ వంటి యువ నటీనటులతో పాటు సీనియర్ నటులు అలీ గారు మరియు సుమన్ గారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

Also Read: Akhanda 2: అఖండ 2 టికెట్ రేట్లపై కీలక ప్రకటన?

ఈ చిత్రానికి టాలెంటెడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. మని జీన్న మరియు విశ్వ వేమూరి సంగీతం అందిస్తుండగా, ఆనంద్ మారుకుర్తి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఉప్పు మారుతీ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. ఈ పాటకి సింగర్ సూర్య పాట రాయడంతో పాటు ఆలపించడం విశేషం. రైటర్ భాను ప్రకాష్ కూడా ఈ చిత్ర బృందంలో భాగమయ్యారు. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్, ఈ ఉత్సాహభరితమైన పాటతో, ‘ఓం హరుడు’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *