Devara

Devara: దుమ్మురేపుతున్న దేవర.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

Devara: దేవర మూవీ థియేటర్లలో దుమ్మురేపుతోంది. మొత్తానికి దేవర పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అని టాక్ బయటకు వచ్చేసింది. ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఈ క్రమంలో హీరో ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నేను ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. మా సినిమాపై మీరు చూపిస్తోన్న అభిమానాన్ని చూసి చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన డ్రామా, భావోద్వేగాలతో ‘దేవర’ తీర్చిదిద్దినందుకు థ్యాంక్యూ కొరటాల శివ. మై బ్రదర్‌ అనిరుధ్‌.. నీ మ్యూజిక్‌తో మా ప్రపంచానికి ప్రాణం పోశావు. ఈ చిత్రానికి బలమైన సపోర్ట్‌గా నిలిచిన మా నిర్మాతలు మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె, అద్భుతంగా వర్క్‌ చేసిన సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు, సాబు సిరిల్‌తోపాటు టెక్నీషియన్స్‌ అందరికీ కృతజ్ఞతలు. నా అభిమానుల వేడుకలు చూసి నా మనసు నిండింది. మీ ప్రేమాభిమానాలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. నాలానే మీరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేయడం చూస్తుంటే సంతోషంగా ఉంది. మీకు మరెంతో వినోదాన్ని అందిస్తానని మాటిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.

Devara: కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర మూవీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ ఆకట్టుకుంది. దేవర ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఉత్కంఠగా సాగుతుంది.. ఫస్ట్ హాఫ్ చివరి 20 నిమిషాలు పవర్ ఫుల్ ఎండింగ్ ఇచ్చారు. ఇక సెకండ్ హాఫ్ లో తారక్ యాక్టింగ్, ఫియర్ సాంగ్ మూవీకి హైలెట్ నిలిచాయి. తారక్, జాన్వీ తమ యాక్టింగ్ తో ఫ్యాన్స్ ను కట్టిపడేశారు. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్యాంగ్ స్టిన్నింగ్ గా ఉంది. వీఎఫ్ఎక్స్ మూవీకి హైలెట్గా నిలిచాయి. అనిరుధ్ బీజీఎం కూడా మూవీకి ప్లస్ పాయింట్ గా మారింది. సైఫ్ అలీఖాన్ పర్ఫామెన్స్ సూపర్, ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంది. ఇక చివరిలో దేవర పార్ట్ 2 శౌర్యాంగ పర్వం టైటిల్ ను రిలీజ్ చేస్తాడు డైరెక్టర్ కొరటాల శివ.

Also Read: దేవరలో ఆమె కొద్దిసేపే కనిపిస్తుందా ? 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *