Hyderabad: హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి డ్యాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు

Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి, ప్రముఖ నటుడు నవీన్ పోలిశెట్టితో కలిసి వేదికపై డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ సందడి కార్యక్రమం ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలోని ‘రాజు గారి పెళ్లిరో’ పాట లిరికల్ వీడియో లాంచింగ్ సందర్భంగా జరిగింది.

మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వేదికగా నిర్వహించిన ఈ వేడుకలో నవీన్–ప్రీతి రెడ్డిల డ్యాన్స్‌కు విద్యార్థులు ఈలలు, చప్పట్లతో ఉత్సాహం వ్యక్తం చేశారు. పాటకు తగ్గ స్టెప్పులతో ఇద్దరూ స్టేజ్‌ను సందడిగా మార్చారు.

నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా ప్రీతి రెడ్డి మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమలో గాడ్‌ఫాదర్ లేకుండా ఎదగడం చాలా కష్టమని అన్నారు. పరిశ్రమలో ఎదుగుతున్నప్పుడు కిందకు లాగేవారు కూడా ఉంటారని పేర్కొన్నారు. ఎన్నో ఇబ్బందులు, నిద్రలేని రాత్రులను ఎదుర్కొని కష్టపడి ఎదిగిన నవీన్ పోలిశెట్టి ఎంతోమందికి ఆదర్శమని ఆమె ప్రశంసించారుఈ కార్యక్రమంతో ‘అనగనగా ఒక రాజు’ చిత్రానికి సంబంధించిన ప్రచారం మరింత జోరందుకుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *