Kurnool Bus Accident: కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. బాధిత కుటుంబాలకు వివరాలు అందించడానికి వీలుగా పలు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ప్రమాదం ఎలా జరిగిందో వివరించారు.
బాధితుల కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు :
ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ఏవైనా సమస్యలు ఉన్నా, వివరాలు తెలుసుకోవాలన్నా ఈ నంబర్లకు ఫోన్ చేయాలని కలెక్టర్ సిరి కోరారు.
- ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ రూమ్స్:
| ప్రదేశం | కంట్రోల్ రూమ్ నెంబర్ | అదనపు నంబర్లు |
| కర్నూలు కలెక్టరేట్ | 08518-277305 | – |
| కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి | 91211 01059 | 94946 09814, 90529 51010 |
| ఘటనా స్థలి వద్ద | 91211 01061 | – |
| కర్నూలు పోలీసు స్టేషన్ | 91211 01075 | – |
Also Read: Kurnool Bus Accident: కర్నూలు ఘోర బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
ప్రమాద కారణం, మృతుల వివరాలు
కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద శుక్రవారం వేకువజామున సుమారు 3.30 గంటలకు ఈ అగ్ని ప్రమాదం జరిగింది. కలెక్టర్ డా.ఏ. సిరి ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత వివరాలు వెల్లడించారు.
ప్రమాద కారణం: బైక్ బస్సు కిందకు వెళ్లడంతో, బస్సులోని ఒక కేబుల్ తెగిపోయింది. దీంతో బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగి, క్రమంగా బస్సు మొత్తం వ్యాపించాయి.
మృతులు: మంటలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత బస్సు నుంచి ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీసినట్లు కలెక్టర్ తెలిపారు.
క్షతగాత్రులు: ప్రమాదం జరిగిన వెంటనే 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడని, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

