బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా, అండమాన్- నికోబార్ దీవుల సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడతో పాటు ఒడిశాలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడబోతుందని 21వ తేదీ నాడు అది అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు
అల్పపీడన ప్రభావంతో చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లు అతలాకుతలం అయ్యాయి. జనజీవనం స్తంభించింది. బెంగళూరులోనూ వర్షాలు దంచికొట్టాయి.మరోసారి అలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సంవత్సరం భారీ వర్షాలతో ఏపీ అతిరయింది విజయవాడ నగరం నీట మునిగిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ సమయంలో మళ్లీ మరో తుఫాన్ వస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజల చింతించొద్దని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు