Tirumala: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
దర్శనానికి సమయం
* ప్రస్తుతం, శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.
* స్వామి వారి దర్శనం కోసం దాదాపు 15 గంటల సమయం పడుతోంది.
తిరుమలలోని క్షేత్ర స్థాయి అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం అందజేస్తున్నారు. భారీగా ఉన్న రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు ప్రణాళికతో తిరుమల యాత్రను కొనసాగించడం మంచిది.