తెలంగాణలో రాబోయే రెండు గంటల్లో ములుగు, భద్రాద్రి, భూపాలపల్లి, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. అలాగే వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, జనగాంలోనూ ఎడాతెరిపి లేని వానలు కురుస్తాయని అంచనా వేశారు. ఇప్పటికే మెదక్, కామారెడ్డి, సిద్దిపేటలో భారీ వర్షాలు కురిశాయి.
రాష్ట్రంలో గడిచిన 12 గంటల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట(D) గౌరారంలో అత్యధికంగా 23.6cmల వర్షపాతం నమోదైంది. ములుగు(సిద్దిపేట)లో 18.6cm, మెదక్‌లోని ఇస్లాంపూర్‌లో 17.85cm, పిట్లం(కామారెడ్డి)లో 17.3cm, కౌడిపల్లి(మెదక్)లో 17.2cm, సంగారెడ్డిలో కంగ్టిలో 16.6cm, శంకరంపేట(మెదక్)లో 16.4cm, అడ్డగూడురు(యాదాద్రి)లో 16.4cmల వర్షపాతం కురిసినట్లు వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 12 గంటల్లో వాయుగుండంగా మారనుందని IMD తెలిపింది. రేపు మధ్యాహ్నానికి ఒడిశా-ఉత్తర కోస్తా మధ్య తీరందాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో APలోని విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూ.గో, ఏలూరుతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, వర్షాలు వచ్చినప్పుడు బలహీనమైన గోడలు, చెట్ల కింద ఉండవద్దని ప్రజలను హెచ్చరించారు.రోడ్లపై నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ జామ్ లు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.