AP Weather: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొద్ది రోజులుగా పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పంటలు నీటమునగడం వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల మధ్య వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు మరో పెద్ద హెచ్చరిక జారీ చేసింది. రానున్న మూడ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వర్షాలకు కారణాలు, వాతావరణ పరిస్థితులు
అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం..
- నైరుతి రుతుపవనాల ఉపసంహరణ: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, తెలంగాణతో సహా పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
- ఉపరితల ఆవర్తనం: నైరుతి బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఇది ఉత్తర తమిళనాడు తీరం, నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉన్న మరో ఉపరితల ఆవర్తనంతో కలిసిపోయింది.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతోనే రాగల మూడ్రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Prashant Kishore: గెలిచే వాళ్లకే సీట్లు.. పక్క ప్లాన్ తో పీకే
నేడు (మంగళవారం) వర్ష సూచన ఉన్న జిల్లాలు
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం..
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.
- అత్యవసరం అయితేనే బయటకు: వర్షం పడే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు.
- సురక్షిత ప్రాంతాల్లో వేచి ఉండాలి: పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఆ సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ ఉన్న ప్రాంతాల్లో వేచి ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.
- జాగ్రత్తలు పాటించాలి: ఈదురు గాలుల ప్రమాదం ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు ప్రజలను కోరారు.