Heavy Rains: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ప్రభుత్వ శాఖలను అలర్ట్ చేసింది. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
విద్యుత్ శాఖ చర్యలు: భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూసేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మూడు షిఫ్టుల్లో దాదాపు 10 వేల మంది సిబ్బందిని సిద్ధం చేసింది. ఎక్కడైనా విద్యుత్ సమస్యలు తలెత్తితే తక్షణమే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: Hyderabad Police: పోలీసుల దాడుల్లో వెలుగులోకి బంగ్లాదేశీయుల నెట్‌వర్క్
జలవనరుల శాఖ సమీక్ష: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండిపోయాయి. నాగార్జునసాగర్, జూరాల, కడెం వంటి ప్రధాన ప్రాజెక్టుల పరిస్థితిపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వద్ద నిరంతర పహారా ఉండాలని, రెవెన్యూ, పోలీసులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని అధికారులను ఆదేశించారు. కాలువ కట్టలు తెగే సూచనలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, నది పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

