Weather: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, తీరప్రాంతాల్లో మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీచేసింది. వర్షాల కారణంగా ప్రజలు అత్యవసర అవసరాల కోసం మాత్రమే బయటికి వెళ్లాలని సూచించింది.
తమిళనాడుపై ప్రభావం
ఈ అల్పపీడనం ప్రభావం తమిళనాడుపై కూడా కనిపిస్తోంది. అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో పరిస్థితి
తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గి, ఉదయం పొగమంచు కమ్మేస్తోంది. ప్రజలు చలి నుంచి రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను పాటించాలని విభాగంకోరింది.