Rain Alert: జూన్ 7, 8 తేదీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. తొలుత మందగించిన నైరుతి రుతుపవనాలలో కాస్త కదలిక వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో జూన్ 7న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఆదివారం (జూన్ 8) కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Traffic Diversions: బక్రీద్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. అటు వైపు వెళితే ఇక అంతే
హైదరాబాద్, ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, మెదక్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, జూన్ 4, 5, 6 తేదీల్లో వాతావరణంలో వేడి వాతావరణం పెరిగింది. దీంతో నైరుతి రుతుపవనాల్లో కదలిక తగ్గింది. ప్రస్తుతం కొంత కదలిక రావడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

