Helath: బరువును తగ్గించుకోవడం అన్నది ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. బరువు పెరగడం సులభమే. కానీ దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. ఇందుకు గాను స్ట్రిక్ట్ డైట్‌ను పాటించాల్సి ఉంటుంది. చిరు తిండి తినాలనే యావను తగ్గించుకోవాలి. ఆహారం తక్కువగా తినాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఇలా పలు కఠిన నియమాలను పాటిస్తే గానీ బరువు తగ్గరు. అయితే దీంతోపాటు బరువును తగ్గించుకోవడంలో నీళ్లు కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. చాలా మంది బరువు తగ్గేందుకు కావల్సిన అన్ని మార్గాలను పాటిస్తారు. కానీ నీళ్లను సరిగ్గా తాగరు. వాస్తవానికి బరువును తగ్గించుకునేందుకు నీళ్లు కూడా ముఖ్య పాత్రను పోషిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లను అయినా సరే తాగాలని డాక్టర్లు చెబుతున్నారు. ఉదయం నిద్ర లేవగానే కనీసం 1 లీటర్ వరకు నీళ్లను తాగినట్లయితే రోజులో కావల్సిన నీళ్ల కోటాలో దాదాపుగా 25 శాతం పూర్తవుతుంది. మిగిలిన కోటాను రోజులో చాలా సులభంగా పూర్తి చేయవచ్చు. కాబట్టి బరువు తగ్గాలని చూస్తున్న వారు నీటి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించడం మంచిది. లేదంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గలేరు. కనుక నీళ్లను రోజూ తప్పనిసరిగా తగినన్ని తాగాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
కొవ్వు కరుగుతుంది..
రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లను అయినా తాగాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. నీళ్లను సరిగ్గా తాగితేనే ఎన్ని వ్యాయామాలు చేసినా, డైట్‌ను పాటించినా ఫలితం ఉంటుందని వారంటున్నారు. నీళ్లను సరిగ్గా తాగకుండా ఏం చేసినా వృథాయేనని బరువు అంతగా తగ్గరని వారు చెబుతున్నారు. కాబట్టి రోజూ తగినన్ని నీళ్లను తాగాల్సి ఉంటుంది. నీళ్లను రోజూ తగినన్ని తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. దీని వల్ల అధిక బరువు తగ్గుతారు. అకాడమి ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం రోజూ తగనన్ని నీళ్లను తాగడం వల్ల శరీర మెటబాలిజాన్ని పెంచుకోవచ్చని తేలింది. కనుక రోజూ తగినన్ని నీళ్లను తాగాల్సి ఉంటుంది.