health tips

Health Tips: చలికాలంలో వేడినీరు తాగుతున్నారా..? అయితే జాగ్రత్తా..

Health Tips: చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల దగ్గు, జలుబు, జ్వరం, కీళ్ల నొప్పులు కామన్. వీటిని పోగొట్టేందుకు వేడినీళ్లు తాగడం సర్వసాధారణం. కానీ ఎక్కువగా వేడినీరు తీసుకోవడం కూడా ప్రాబ్లమే అవుతుంది. చలికాలంలో వేడినీరు ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో చూద్దాం.

డీహైడ్రేషన్:
వేడి నీటిని తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్​కు గురవుతుంది. చలికాలంలో చాలా మంది తక్కువ నీరు తాగుతారు. కానీ కొంతమంది చలిని తట్టుకోవడానికి ఎక్కువ వేడినీటిని తాగుతారు. కానీ ఇలా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జీర్ణక్రియ సమస్య:
వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల జీర్ణక్రియ సమస్య ఏర్పడుతుంది. కడుపు వేడితో పాటు గ్యాస్, యాసిడ్ సమస్య పెరుగుతుంది. మలబద్ధకం కూడా బాధిస్తుంది. కాబట్టి జీర్ణ సమస్యలను నివారించడానికి తక్కువ వేడి నీటిని త్రాగాలి.

ఇది కూడా చదవండి: Bigg Boss 8 Winner: ‘నిఖిల్’ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్.. ఎన్ని లక్షలు గెలుచుకున్నాడో తెలుసా..?

గొంతు నొప్పి:
చలికాలంలో గొంతు నొప్పి సర్వసాధారణం. కొంత మంది గొంతు నొప్పి ఉందని వేడినీరు తాగుతారు. కానీ వేడినీళ్లు ఎక్కువగా తాగితే గొంతు నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

కిడ్నీ సమస్యలు:
కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా వేడి నీటిని తాగకూడదు. ఇది మూత్రపిండాలపై చెడు ప్రభావం చూపుతోంది. కిడ్నీలు చల్లటి నీటిని శుద్ధి చేస్తాయి. వేడినీరు ఎక్కువగా తాగితే కిడ్నీలు నీటిని శుద్ధి చేయలేవు.

నిద్ర భంగం:
రాత్రిపూట ఎక్కువగా వేడినీరు తాగితే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. దీన్ని వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. రాత్రిపూట ఎక్కువగా వేడినీరు తాగకూడదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *