Health tips: మనకు తెలియకుండానే శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయనే విషయం మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యధిక మధుమేహ వ్యాధి వారిన వేగంగా పడుతున్న వారు ఉన్న దేశాల్లో మనదేశం కూడా ప్రధానంగా ఉన్నదని తెలుసా? మన జీవన శైలి ఆ వ్యాధి బారిన పడేస్తున్నదని మీరు గుర్తించారా? ముఖ్యంగా ఈ 7 అలవాట్లతో మీకు ఆ మధుమేహ ముప్పు ఉన్నదని గుర్తిస్తే చాలు. లేదంటే మీరు ప్రమాదంలో పడినట్టే.
గంటల తరబడి కుర్చీలో కూర్చోవడం
Health tips: గంటల తరబడి కదలకుండా అలాగే కుర్చీలో కూర్చొని ఉండటం ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. ఇలా చేయడం వల్ల కండరాలు, కీళ్లే కాకుండా జీవక్రియలు కూడా దెబ్బతింటాయి. దీని వలన మధుమేహం, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉన్నదని మీరు గుర్తించాల్సిందే.
అల్పాహారం దాటవేయడం
Health tips: కొందరు ఉదయాన్నే టిఫిన్ చేయడాన్ని ఆలస్యం చేస్తూ ఉంటారు. కొందరు ఏకంగా ఉదయం ఏమీ తినకుండానే మధ్యాహ్నం ఏకంగా అన్నమే తింటుంటారు. అలా ఉదయాన్నే మీరు అల్పాహారం తినకుండా దాటవేయడం వలన మీ శరీర రక్తంలో షుగర్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి. ఇన్సులిన్ ప్రతిస్పందనను తగ్గిస్తుంది.
ఫైబర్ తక్కువగా తీసుకోవడం
Health tips: మీరు ఫైబర్ ఆహారం తీసుకుంటే అది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. బ్లడ్ షుగర్ స్థిరీకరిస్తుంది. ఆకస్మిక పెరుగుదలను నియంత్రిస్తుంది. కానీ, మీరు తీసుకునే ఆహారంలో సరైన ఫైబర్ లేకుంటే షుగర్ లెవల్స్ పెరిగేందుకు చాన్స్ ఉంటుంది. అందుకే ఫైబర్ ఉండే ఆహార పదార్థాలను ప్రతి ఒక్కరూ ఎంచుకోవాలి.
కాఫీలు ఎక్కువగా తాగడం
Health tips: కొందరు కాఫీలు, టీలు లాగించేస్తుంటారు. ఎంత అని లెక్కలేకుండానే తరచూ తాగుతూ ఉంటారు. ఇంటికి బంధుమిత్రులొచ్చినా, బయట స్నేహితులు కలిసినా, ఎక్కడికైనా వెళ్లినా, ఆఫీసులో ఉన్నా.. ఇలా ప్రతిచోట కాఫీలు, టీలు తాగుతూ ఉండటం ప్రతి ఒక్కరికీ అలవాటుగా మారింది. అధిక కెఫీన్ కార్డిసోల్ అనే హార్మోన్‌ను పెంచి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగేలా చేస్తుంది.
సరైన నిద్ర లేకపోవడం
Health tips: కొందరు రాత్రి సమయాల్లో నిద్ర సరిగా పోరు. ఇంకొందరికి నిద్ర పట్టదు. గతంలో టీవీలు చూస్తూ నిద్రను దూరం చేసుకుంటే, ఇటీవల సెల్ ఫోన్లలో రీల్స్‌తోనే సగం రాత్రిని గడిపేస్తున్నారు. దీంతో నిద్రను చంపేస్తున్నారు. దీంతో రాత్రి తగినంత నిద్ర లేకపోవడం వలన ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దీనివల్ల కూడా మధుమేహం మన దరికి చేరడం ఈజీ అవుతుంది.
గబగబా తినడం
Health tips: మనలోనే చాలా మంది ఆహారాన్ని గబగబా తినేస్తుంటారు. కనీసం నమలకుండా కొరికి కడుపులోకి పడేస్తుంటారు. నమిలి తింటే లాలాజలం ఊరి దానిలో జీర్ణరసాలు ఊరి మనం తిన్న ఆహారాన్ని సక్రమంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. కానీ సరిగా నమలకుండా, గబగబా తినేయడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు పెరిగి మధుమేహానికి దారితీస్తుంది.
చిరుతిళ్లు తినడం
Health tips: మనలో చాలా మంది సరైన ఆహారాన్ని తీసుకోవడమే లేదు. పట్టణాల్లో, నగరాల్లో బయట చిరుతిళ్లు తినడం ఎక్కువ మందికి అలవాటు. జంక్‌ఫుడ్‌ను లాగించేస్తూ ఉంటారు. ఈ సంస్కృతి పల్లెలకు కూడా వ్యాపించింది. చిరుతిళ్లు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం వలన రోజంతా రక్తంలో చక్కెరను ఉంచుతుంది.

