Onion Juice: ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిని కోసేటప్పుడు కన్నీళ్లు వచ్చినా..దాన్ని ప్రయోజనాలు మాత్రం అద్భుతమనే చెప్పాలి. ఉల్లిపాయరసం జుట్టు పెరుగుదలకు సహాయపడి..జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చుండ్రు సమస్యలను పరిష్కరిస్తుంది. ఇది చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా చర్మం దృఢంగా, యవ్వనంగా కనిపిస్తుంది.
రోగనిరోధక శక్తికి:
ఉల్లిపాయల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
గుండె ఆరోగ్యం:
ఉల్లిపాయలు రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, గుండెను వ్యాధుల నుండి రక్షించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
శ్వాసకోశ వ్యాధులకు చెక్ :
ఉల్లిపాయల్లో ఉండే క్వెర్సెటిన్ అనే సమ్మేళనం ఉబ్బసం, అలెర్జీలు వంటి శ్వాసకోశ వ్యాధుల నుండి రక్షిస్తుంది.
Also Read: Vitamin D Deficiency: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? అయితే జాగ్రత్త
నొప్పిని తగ్గిస్తుంది:
ఉల్లిపాయలలోని శోథ నిరోధక లక్షణాలు శరీరంలో నొప్పి, అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
ఎముకల ఆరోగ్యం:
ఉల్లిపాయలలోని కొన్ని భాగాలు హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.