ICC tournament: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో కూడా టీమ్ ఇండియా తన విజయ పరంపరను కొనసాగించి, న్యూజిలాండ్‌ను 44 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 249 పరుగులు సాధించగా, న్యూజిలాండ్ జట్టు 205 పరుగులకే ఆలౌట్ అయ్యింది. గత కొన్ని సంవత్సరాలుగా ఐసీసీ టోర్నమెంట్‌లలో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శనలను ఇస్తోంది. ఈ విజయాల వెనుక కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ పటిమ కూడా ఉంది. రోహిత్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా అద్భుతంగా రాణిస్తోంది.
మ్యాటర్ ఏంటంటే… ఐసీసీ టోర్నమెంట్‌లలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ అద్భుతమైన రికార్డును సృష్టించాడు. అది 50 ఓవర్ల వన్డే ప్రపంచకప్ అయినా, టీ20 ప్రపంచకప్ అయినా లేదా ఛాంపియన్స్ ట్రోఫీ అయినా, రోహిత్ కెప్టెన్సీలో టీమ్ ఇండియాను ఓడించడం చాలా కష్టమని నిరూపించారు. 2023 ప్రపంచకప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా ఓడిపోయినప్పటికీ, 2024 లో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఇంకా, రోహిత్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా ఐసీసీ టోర్నమెంట్‌లలో నాకౌట్ స్టేజ్‌కు కూడా చేరుకుంది.
Also Read: IND vs AUS: సెమీస్ కు ముందు భారత్ కు పెద్ద తలనొప్పి..! ఆస్ట్రేలియా ఏ వ్యూహంతో బరిలోకి వస్తుంది అంటే…
ICC tournament: రోహిత్ శర్మ రికార్డును పరిశీలిస్తే, ఐసీసీ టోర్నమెంట్‌లలో కెప్టెన్‌గా 92.8 శాతం మ్యాచ్‌లను గెలిచాడు. రోహిత్ తర్వాత రెండవ స్థానంలో రికీ పాంటింగ్ ఉన్నాడు. రికీ పాంటింగ్ తన కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టును 88.3 శాతం మ్యాచ్‌లలో విజయం వైపు నడిపించాడు. అదే విధంగా, క్లైవ్ లాయిడ్ వెస్టిండీస్ జట్టును 88.2 శాతం మ్యాచ్‌లలో గెలిపించారు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీమ్ ఇండియా 83.3 శాతం మ్యాచ్‌లలో విజయం సాధించింది.
ఇక నిన్నటి మ్యాచ్ లో టీంఇండియా హీరోల గురించి క్లుప్తంగా చెప్పాలంటే.m. న్యూజిలాండ్ జట్టు భారత్ పై 250 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైంది. టీమ్ ఇండియా విజయానికి వరుణ్ చక్రవర్తి 42 పరుగులకు 5 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా అంతకుముందు శ్రేయస్ అయ్యర్ 79 పరుగులతో రాణించడంతో టీమ్ ఇండియా 249 పరుగులు సాధించింది. ఇప్పుడు టీమ్ ఇండియా రేపు జరగబోయే సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.