Shiv Nadar: HCL సహ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ దేశంలోనే అతిపెద్ద దాన శీలుడుగా నిలిచారు.. శివ్ అలాగే అతని కుటుంబం గత సంవత్సరం అంటే 23-2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,153 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంటే రోజుకు రూ.5.90 కోట్లు దానం చేశారు. ఈ సమాచారం ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2024లో ఇచ్చారు.
నవంబర్ 7, గురువారం విడుదల చేసిన జాబితాలో నాడార్ కుటుంబం అగ్రస్థానంలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబం రెండో స్థానంలో నిలిచారు. వారు FY 23-2024లో రూ. 407 కోట్లు విరాళంగా ఇచ్చారు. బజాజ్ కుటుంబం రూ. 352 కోట్లు విరాళంగా ఇవ్వడం ద్వారా జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఇది 2023 కంటే 33% ఎక్కువ.
ఇది కూడా చదవండి: Indian Railways: రికార్డ్ సృష్టించిన భారత రైల్వేలు.. ఒక్కరోజే అంతమంది
Shiv Nadar: దాతల జాబితాలో మొదటి 10 మంది వ్యక్తులు రూ. 4,625 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఇది లిస్ట్ లోని మొత్తం విరాళాలలో 53%. ఈ జాబితాలో కృష్ణ చివుకుల, సుస్మిత, సుబ్రొతో బాగ్చి 7వ, 9వ స్థానాల్లో నిలిచారు. టాప్ 10 మంది దాతలలో ఆరుగురు తమ CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద విద్యకు ఎక్కువ డబ్బు ఇచ్చారు.