HCA:

HCA: కేటీఆర్‌, క‌విత‌పై సీఐడీకి టీసీఏ ఫిర్యాదు.. హెచ్‌సీఏ అక్ర‌మాల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

HCA:హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌లో చోటు చేసుకున్న అక్రమాల‌పై బీఆర్ఎస్‌ మాజీ మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ క‌విత‌తో పాటు మ‌రికొంద‌రిపై తెలంగాణ క్రికెట్ అసోసియేష‌న్ (టీసీఏ) సీఐడీ, ఈడీకి ఫిర్యాదు చేసింది. గురువారం (జూలై 17) సీఐడీ చీఫ్ చారుసిన్హాను టీసీఏ అధికారులు క‌లిసి ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా జ‌గ‌న్మోహ‌న్‌రావు గెలిచిన వెంట‌నే త‌న విజ‌యం కేటీఆర్‌, క‌విత‌, హ‌రీశ్‌రావుకు అంకితం.. అని చెప్పిన‌ట్టు వారు సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

HCA:హెచ్‌సీఏ అక్ర‌మాల‌లో కేటీఆర్‌, క‌విత‌తోపాటు మ‌రికొంద‌రు ఉన్నార‌ని, వారిపైనా ద‌ర్యాప్తు చేయాల‌ని టీసీఏ కోరింది. ఈ మేర‌కు కేటీఆర్‌, క‌విత‌తోపాటు జాన్ మ‌నోజ్‌, విజ‌యానంద్‌, పురుషోత్తం అగ‌ర్వాల్‌, సురేంద‌ర్ అగ‌ర్వాల్‌, వంకా ప్ర‌తాప్‌పైనా టీసీఏ ప్రెసిడెంట్ యండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ‌, సెక్ర‌ట‌రీ గురువారారెడ్డి త‌దిత‌రులు సీఐడీ చీఫ్‌ను క‌లిసి ఫిర్యాదు చేశారు.

HCA:బీఆర్ఎస్ ప్ర‌భుత్వ పెద్ద‌ల అండ‌దండ‌ల‌తోనే ఆనాడు జ‌గ‌న్‌మోహ‌న్‌రావు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అయ్యార‌ని టీసీఏ ఆరోపించింది. క్రికెట్‌కు సంబంధ‌మే లేని రాజ‌కీయ నేత‌ల ప్ర‌మేయంపై విచార‌ణ జ‌ర‌పాల‌ని టీసీఏ సీఐడీని కోరింది. హెచ్‌సీఏ అక్ర‌మాల వ్య‌వ‌హారంలో మ‌నీలాండ‌రింగ్ దాగి ఉన్న‌ద‌ని ఆరోపిస్తూ ఈడీ అధికారుల‌కు కూడా టీసీఏ ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు ఆయా ద‌ర్యాప్తు సంస్థ‌ల్లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారిపై కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉన్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *