Hyderabad: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో జరిగిన అవినీతి కేసులో ప్రధాన కార్యదర్శి దేవరాజ్‌ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని పుణేలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో దేవరాజ్ రెండవ నిందితుడిగా (ఏ2) ఉన్నారు. తాజా అరెస్టుతో అరెస్టయినవారి సంఖ్య ఆరుగురికి చేరింది.
ఇందుకు ముందు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును కూడా సీఐడీ అరెస్టు చేసింది. నకిలీ పత్రాలతో అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారని ఆరోపణల నేపథ్యంలో ఆయనను అరెస్టు చేశారు. అలాగే మరో నలుగురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా దేవరాజ్ అరెస్టుతో ఈ కేసు మళ్లీ దృష్టిలోకి వచ్చింది.