Cinnamon tea: టీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చాలా మందికి ఉదయం టీ లేకపోతే రోజే స్టార్ట్ అవదు. కొన్ని రకాల టీలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాంటి జాబితాలో దాల్చిన చెక్క టీ కూడా ఒకటి. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది శరీరంలోకి చక్కెర ప్రవేశించకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. మరి రోజూ దాల్చిన చెక్క టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దాల్చిన చెక్క టీ ఉపయోగాలు : దాల్చిన చెక్క టీలో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. అవి జీవక్రియను మెరుగుపరచడంలో, శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
దాల్చిన చెక్కలో బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. దాల్చిన చెక్క ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది. గ్లూకోజ్‌ను కణాలలోకి త్వరగా రవాణా చేయడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ ప్రతిస్పందనను
మెరుగుపరచడానికి దాల్చిన చెక్క పనిచేస్తుంది. ముఖ్యంగా ఇన్సులిన్ నిరోధకత లేదా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి సహాయపడుతుంది.
Also Read: Summer Health: వేసవిలో ఏం తినాలి..? ఏం తినొద్దు..?
Cinnamon tea: డయాబెటిస్ ఉన్నవారికి టీ తాగడం మానేయడం కష్టంగా ఉంటే..మీరు దానిలో చిన్న మార్పులు చేసుకుని దాల్చిన చెక్క టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
టీలో దాల్చిన చెక్కను జోడించడం వల్ల గ్లూకోజ్ శరీరంలోకి నెమ్మదిగా ప్రవేశిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధిస్తుంది. ఉపవాసం ఉన్న సమయంలో దాల్చిన చెక్కను ఎక్కువసేపు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కొద్దిగా తగ్గుతాయి.
దాల్చిన చెక్క టీ ఎలా తయారు చేయాలి?
టీలో దాల్చిన చెక్క కలపడం చాలా సులభం. మీ టీలో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి. ఈ రుచిని మరింత పెంచుకోవాలనుకుంటే.. టీ తయారుచేసేటప్పుడు దాల్చిన చెక్క పొడికి బదులుగా నేరుగా దాల్చిన చెక్కను వేసి బాగా మరిగించవచ్చు. మీరు ఈ మిశ్రమంలో అల్లం, లవంగాలను కూడా ఉపయోగించవచ్చు. ఈ విధంగా టీ తయారు చేసుకోవడం ద్వారా మీరు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.