Mahesh babu

Mahesh babu: మహేష్, రాజమౌళి షెడ్యూల్ పూర్తి చేశారా!?

Mahesh babu: టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకధీరుడుగా సాగుతున్న రాజమౌళి మహేశ్ బాబుతో రూపొందిస్తున్న సినిమా పూజతో ఆరంభమైన విషయం తెలిసిందే. తన సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతుంటాడు రాజమౌళి. తాజా చిత్రంకి సంబంధించి కూడా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశారట. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ రూపొందించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారట. అక్కడే కాకుండా మరికొన్ని చోట్ల కూడా సెట్స్ రెడీ చేశారట. ఆ యా చోట్ల షూట్ కి రెడీ అవుతున్నారట.

Mahesh babu: జనవరి నెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్ జరపబోతున్నారట. అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందే చిత్రమిది. కథకి తగ్గట్లు కొన్ని కీలక సన్నివేశాలను అమెజాన్ అడవుల్లోనే చిత్రీకరించనున్నారు. దీనికి సంబంధించిన రెక్కీ కూడా చేసి వచ్చాడు రాజమౌళి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ఎంపికైనట్లు, దానికోసమే ప్రియాంక హైదరాబాద్ కి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఎంపికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సాంకేతికతపై మంచి పట్టు ఉన్న రాజమౌళి ఈ సినిమా కోసం ఎఐ టెక్నాలజీని కూడా వాడబోతున్నాడట. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. మరి ఈ మూవీకి సంబంధించిన సమాచారాన్ని రాజమౌళి అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తాడో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *