Harish Shankar : హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా స్టార్ట్ చేసి ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ మోడ్‌లోకి వెళ్లాడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ఎప్పుడు మళ్లీ రిస్టార్ట్ అవుతుందో ఇంకా క్లారిటీ లేదు కానీ.. హరీష్ మాత్రం తన నెక్స్ట్ మూవీస్‌పై గట్టిగా ఫోకస్ పెట్టాడు. ఉస్తాద్ రామ్ పోతినేని, నందమూరి బాలకృష్ణతో రెండు బడా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడట.
Also Read: Peddi First Shot: టాక్సిక్ రికార్డుని బ్రేక్ చేసిన పెద్ది!
Harish Shankar : రామ్‌తో ఓ సాలిడ్ ఫిల్మ్ కోసం స్క్రిప్ట్ వర్క్ షురూ చేశాడు. కూర్గ్‌లో ఉంటూ కథను ఫైనలైజ్ చేస్తున్నాడని టాక్. అటు బాలయ్యతో కూడా ఓ మాస్ బ్లాస్ట్ సినిమాకు ప్లాన్స్ రెడీ చేస్తున్నాడు. హరీష్ శంకర్ స్టైల్‌లో మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ రెండు సినిమాలు థియేటర్లలో సందడి చేయడం పక్కా అంటున్నారు. స్క్రిప్ట్ ఎప్పుడు రెడీ అవుతుంది.. షూటింగ్ ఎప్పుడు కిక్‌స్టార్ట్ అవుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య, రామ్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్స్ కోసం ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. హరీష్ కెరీర్‌లో ఈ సినిమాలు హిట్ కొడతాయా? అనేది వేచి చూడాల్సిందే!