Harish Rao: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న (మార్చి 2న) సీఎం రేవంత్‌రెడ్డి ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద.. బీఆర్ఎస్‌పై, హరీశ్‌రావుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు ప్రతి సవాళ్లు విసిరారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం చుట్టే తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..సీఎం పదవికి నువు చేస్తావా?
Harish Rao: బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులు జరగలేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అసలే పనులు జరగలేదని సీఎం రేవంత్ నిరూపించాలని హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఒకవేళ ఆయన చెప్పింది నిజమైతే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. లేనిపక్షంలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.
Harish Rao: ఎస్ఎల్‌బీసీ ప్రమాద ఘటన విషయంలో రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదని హరీశ్‌రావు విమర్శించారు. ప్రమాదం జరిగి 10 రోజులవుతున్నా, గల్లంతైన వారి ఆచూకీని కనిపెట్టలేకపోయారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడతామని హెచ్చరించారు. పులిచింతల కట్టి తెలంగాణ అన్యాయం చేసింది మీరే కదా అని కాంగ్రెస్ నేతలను దుయ్యబట్టారు.
Harish Rao: తన సన్నిహితుడి కూతురు వివాహం కోసం అబుదాబి వెళ్లిన మాట వాస్తవమేనని హరీశ్‌రావు వివరణ ఇచ్చారు. అయితే మోకాలికి, బోడిగుండుకు ముడేసి మోసగించడం రేవంత్‌రెడ్డికి అలవాటేనని ధ్వజమెత్తారు. వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడం కోసం ఈ డ్రామా అని పేర్కొన్నారు. నోరు ఉంది కదా అని ఏదిపడితే అది మాట్లాడితే సమాజంలో చెల్లదని రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు మండిపడ్డారు.